Welcome to Tirupathi City(తిరుపతి ఇన్ఫర్మేషన్)

అంధ్రప్రదేశ్ లో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో తిరుపతి పుణ్యక్షేత్రం ఒకటి. రాయలసీమ జిల్లాలలో అత్యంత విశిష్టమైన ప్రాంతంగా గుర్తింపు పోందింది. చెన్నై, బెంగుళూరు నగరాలను కలుపుతూ ఉండే ఈ నగరం.., కోట్లాది మంది హిందువుల అరాధ్యదైవమైన శ్రీవేంకటేశ్వరుడు కోలువైన దివ్యక్షేత్రం ఇది. వేల కోట్ల సంవత్సరాల చరిత్రకలిగిన ఈ నగరం.., అధ్యాత్యికంగా ఎంతో ఖ్యాతిగడించింది. ఏపిలోని వైజాగ్, విజయవాడ నగరాల తర్వాత అత్యంత వేగంగా విస్తరిస్తూ..., అభివృద్దిపధంలో ముందుకు దూసుకెళ్తున్న ఈ నగరం విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో రాయలసీమ ప్రాంతవాసులకు చుక్కానిగా నిలుస్తోంది. తిరుపతి నగరంలో ఇప్పటికే ఎస్వీయూనివర్శిటీ, పద్మావతి మహిళావర్శిటీ, రాష్ట్రయ సంస్కృత విద్యాపీఠం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, వేదవిశ్వవిద్యాలయం, స్విమ్స్ డీమ్డ్ యూనివర్శిటీలతో విద్యార్ధుల బంగరు భవిష్యత్తు బాటలు వేస్తోంది. తాజాగా కేంద్రప్రభుత్వం ఐఐఐటీతో పాటు భారతీయ పాకశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించింది. దీంతో ఈ నగరం ఇటు శ్రీవారి వైభవంతో పాటు, అటు విద్యారంగంలో ప్రపంచ గుర్తింపు పోందింది. ఈ నేపధ్యంలో తిరుపతి నగరానికి సంబంధించిన పూర్తిస్ధాయి సమాచారాన్ని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు, స్ధానికులకు అందుబాటలో ఉన్న సౌకర్యాలను తెలియజేసేందుకు మేము ఈ వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగింది. అధునిక యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో యాండ్రాయిడ్ మొబైల్ ఉండటంతో పాటు.., ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రభుత్వాలు సైతం ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలను అందిస్తున్న క్రమంలో అందరికీ అందుబాటులో ఉన్న సేవలను తెలియజేసేందుకు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. తిరుపతి నరగం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్ధలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వసతి సౌకర్యాలు, వ్యాపార సంస్ధలు, స్వచ్చంధ సంస్ధలు ఇలా అన్ని రకాలైన పబ్లిక్.., ప్రవేటు సంస్ధల వివరాలన్నీ మీకు అందుబాటు మీ ముందు ఉంచేందుకు అత్యుత్తమ.., నాణ్యమైన సేవలు వినియోగదారుడికి అందాలన్న లక్ష్యంతో ఈ వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగింది. సర్వదా మేము మీ వెన్నంటి ఉంటూ మీ సేవలో తరించేందుకు వీలుగా మీ అందరి అదరాభిమానాలు.., అశీస్సులు అందజేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం... వెబ్ మేనేజ్ మెంట్.